Share News

ప్రాణం నిలిపిన దాతల సాయం

ABN , Publish Date - Jan 14 , 2026 | 02:08 AM

క్యాన్సర్‌తో బాధ పడుతున్న తండ్రి ప్రాణాలు నిలిపేందుకు తనయుడు తన ఇన్‌స్టాగ్రాం ఫాలోవర్ల సాయంతో ఆసరాగా నిలిచాడు.

 ప్రాణం నిలిపిన దాతల సాయం

చిత్తూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):. క్యాన్సర్‌తో బాధ పడుతున్న తండ్రి ప్రాణాలు నిలిపేందుకు తనయుడు తన ఇన్‌స్టాగ్రాం ఫాలోవర్ల సాయంతో ఆసరాగా నిలిచాడు. చిత్తూరు శేషాచలపురానికి చెందిన 67 ఏళ్ల వేదమూర్తి ప్రైవేటు స్కూల్‌లో పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. భార్య మంజుల, కుమారుడు మహే్‌షతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. 2022లో ఆయనకు బ్లాడర్‌లో క్యాన్సర్‌ బయటపడింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు శక్తి మేరకు ఖర్చు చేసి చికిత్స అందించారు. గతేడాది జూన్‌ 2న ఎమర్జెన్సీగా ఆపరేషన్‌ చేయాలని, రూ.6 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో వేదమూర్తి కుమారుడు మహేష్‌ సోషల్‌ మీడియాను ఆశ్రయించాడు. జూన్‌ 10న ఫండ్‌ రైజింగ్‌ కోసం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. అతడి ఇన్‌స్టాలో ఉన్న లక్ష మంది ఫాలోవర్లు స్పందించి అండగా నిలిచారు. వారి నుంచి రూ.6 లక్షలు సమకూరడంతో తండ్రికి ఆపరేషన్‌ చేయించారు. ప్రస్తుతం వేదమూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 02:08 AM