సింహ, ముత్యపు పందిరి వాహనాలపై వేద సంరక్షకుడి చిద్విలాసం
ABN , Publish Date - May 04 , 2026 | 02:04 AM
నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు సింహ, ముత్యపు పందిరి వాహనాలపై విహరించారు. ఉదయం మత్స్యావతార మూర్తిగా వేదనారాయణుడు సింహ వాహనంపై పురవీధుల్లో విహరించారు. ఆలయ రాజగోపురం ఎదుట ఉదయం 11 గంటల సమయంలో స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. రాత్రి వేదనారాయణుడిని సుందరంగా ముస్తాబు చేసి ముత్యపు పందిరి వాహనంపై అధిష్ఠింపజేసి ఊరేగించారు. ఏర్పాట్లను ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసులురెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, చెంగల్ రాయలు పర్యవేక్షించారు.
నాగలాపురం, మే 3 (ఆంధ్రజ్యోతి): నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు సింహ, ముత్యపు పందిరి వాహనాలపై విహరించారు. ఉదయం మత్స్యావతార మూర్తిగా వేదనారాయణుడు సింహ వాహనంపై పురవీధుల్లో విహరించారు. ఆలయ రాజగోపురం ఎదుట ఉదయం 11 గంటల సమయంలో స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. రాత్రి వేదనారాయణుడిని సుందరంగా ముస్తాబు చేసి ముత్యపు పందిరి వాహనంపై అధిష్ఠింపజేసి ఊరేగించారు. ఏర్పాట్లను ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసులురెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, చెంగల్ రాయలు పర్యవేక్షించారు.