Share News

యాళి వాహనంపై వరసిద్ధుడి వైభవం

ABN , Publish Date - Sep 30 , 2026 | 12:22 AM

కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో మంగళవారం రాత్రి యాళి వాహనంపై వరసిద్ధుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి అగరంపల్లెకు చెందిన ఎ.నరసింహారెడ్డి కుమారులు, చినకాంపల్లెకు చెందిన పి.సుబ్బారెడ్డి కుమారులు

యాళి వాహనంపై వరసిద్ధుడి వైభవం

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు, 29 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో మంగళవారం రాత్రి యాళి వాహనంపై వరసిద్ధుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి అగరంపల్లెకు చెందిన ఎ.నరసింహారెడ్డి కుమారులు, చినకాంపల్లెకు చెందిన పి.సుబ్బారెడ్డి కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉదయం మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తీసుకురావడంతో అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లకు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను యాళి వాహనంపై అధిష్ఠింపచేసి పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌, ఏఈవోలు రవీంద్రబాబు, ధనపాల్‌, సూపరింటెండెంట్లు కోదండపాణి,వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రవి, బాలాజీనాయుడు, ఉభయదారులు పాల్గొన్నారు.

కాణిపాకంలో నేడు

బుధవారం రాత్రి కల్పవృక్ష వాహన సేవ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.

Updated Date - Sep 30 , 2026 | 12:22 AM