Share News

వృషభ వాహనంపై గజ ముఖుడి వైభవం

ABN , Publish Date - Sep 20 , 2026 | 01:19 AM

స్వయంభువు కాణిపాక వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

వృషభ వాహనంపై గజ ముఖుడి వైభవం

ఐరాల(కాణిపాకం),సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్వయంభువు కాణిపాక వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో శనివారం ఉదయం చిలుక వాహనంపై గణనాథుడు ఊరేగుతూ దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఆర్యవైశ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. రాత్రి వృషభ వాహనంపై స్వామి ఊరేగారు. కాణిపాకం, సంతపల్లె, మారేడుపల్లె, ముదిగోళం, చిత్తూరుకు చెందిన శాలివాహన వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. వీరు ఉభయ వరస తీసుకు రావడంతో కల్యాణ వేదికపై ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. వృషభ వాహనాన్ని శోభాయమానంగా అలంకరించి సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధుని ఉత్సవర్లను వాహనంపై ఆశీనులను చేశారు. అనంతరం బాజాభజంత్రీల మధ్య స్వామిని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు దర్శించుకుని మెక్కులు తీర్చుకున్నారు. ఆస్థాన మండపంలో సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. కార్యక్రమంలో చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌, ఏఈవో రవీంద్రబాబు, ప్రోటోకాల్‌ ఏఈవో ధనపాల్‌, సూపరింటెండెంట్లు వాసు,కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి, ఉభయదారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 01:19 AM