Share News

వైభవంగా గోదాదేవి కల్యాణం

ABN , Publish Date - Jan 15 , 2026 | 02:07 AM

కాణిపాక వినాయక స్వామి ఆలయానికి అనుబంధమైన వరదరాజస్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

వైభవంగా గోదాదేవి కల్యాణం
గోదాదేవి ఊరేగింపు

ఐరాల(కాణిపాకం), జనవరి 14: కాణిపాక వినాయక స్వామి ఆలయానికి అనుబంధమైన వరదరాజస్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.కాణిపాకానికి చెందిన ధనంజయయాదవ్‌ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోదాదేవి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు.చైర్మన్‌ మణి నాయుడు, ఈవో పెంచల కిషోర్‌, అర్చకులు శ్రీనివాస భట్టాచార్యులు, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రవి, బాలాజీనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 15 , 2026 | 02:07 AM