ఒకేసారి వెంకట,రామ,కృష్ణుల కటాక్షం
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:00 AM
తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో ముగింపురోజైన బుధవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత కృష్ణస్వామి ఉత్సవమూర్తులతో కలిసి మలయప్పస్వామి మాడవీధుల్లో దర్శనమివ్వడంతో భక్తులు పులకించిపోయారు.
పులకించిన భక్తజనం
తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో ముగింపురోజైన బుధవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత కృష్ణస్వామి ఉత్సవమూర్తులతో కలిసి మలయప్పస్వామి మాడవీధుల్లో దర్శనమివ్వడంతో భక్తులు పులకించిపోయారు.పౌర్ణమి కావడంతో మాడవీధుల్లోని గ్యాలరీల్లో చేరిన భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర హారతులు ఇస్తూ గోవింద నామస్మరణ చేశారు. తుంబురతీర్థ ముక్కోటికి వెళ్లి వచ్చిన భక్తులు కూడా జత కావడంతో మాడవీధులు రద్దీగా కనిపించాయి.
- తిరుమల, ఆంధ్రజ్యోతి