రాయచోటి అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jan 10 , 2026 | 02:34 AM
రాయచోటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. విద్య, ఐటీ, స్కిల్ డెవల్‌పమెంట్ రంగాల్లో ప్రాధాన్యమిస్తామని ఐటీ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలియజేశారు.
రాయచోటి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాయచోటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. విద్య, ఐటీ, స్కిల్ డెవల్‌పమెంట్ రంగాల్లో ప్రాధాన్యమిస్తామని ఐటీ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలియజేశారు. శుక్రవారం లోకేశ్‌తో ఆయన నివాసంలో భేటీ అయినట్లు మండిపల్లి చెప్పారు. రాయచోటి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించామన్నారు. విద్య, ఐటీ రంగాల్లో రాయచోటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ప్రభుత్వం, సంపూర్ణ మద్దతు ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చినట్లు తెలియజేశారు.