Share News

రేపు అర్ధరాత్రి వైకుంఠద్వారాలు మూసివేత

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:21 AM

వైకుంఠద్వార దర్శనాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే

రేపు అర్ధరాత్రి వైకుంఠద్వారాలు మూసివేత

తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను గురువారం అర్ధరాత్రి మూసివేయనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబరు 30వ తేది నుంచి 10 రోజుల పాటు కొనసాగించేలా వైకుంఠద్వార దర్శనాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 8వ తేదీ అర్ధరాత్రి ఏకాంతసేవ సమయంలో వైకుంఠద్వారాలు మూసివేయనున్నారు. 9వ తేదీ నుంచి యథావిధిగా ప్రత్యేక దర్శనాలన్నీ తిరిగి ప్రారంభంకానున్నాయి. ఇక, గడిచిన ఏడు రోజుల్లో 5.42 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, రూ.28.69 కోట్లు హుండీ కానుకలుగా లభించాయి. మరోవైపు ఆది, సోమవారాలతో పోల్చితే మంగళవారం తిరుమలలో రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతోంది. చివరి రెండురోజులు రద్దీ అధికంగా ఉండొచ్చని టీటీడీ అంచనా వేస్తోంది.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 07 , 2026 | 01:21 AM