Share News

పెద్దశేషుడి పాన్పుపై గోవిందుడి రూపాన

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:14 AM

సోమవారం రాత్రి ఏడుతలల పెద్దశేషుడి పాన్పుపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి దర్శనమిచ్చారు

పెద్దశేషుడి పాన్పుపై గోవిందుడి రూపాన

తిరుమల, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన సోమవారం రాత్రి ఏడుతలల పెద్దశేషుడి పాన్పుపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి దర్శనమిచ్చారు.గోవిందరాజస్వామి అలంకారంలో స్వర్ణశేషుడిపై దేవేరులతో చల్లటి వాతావరణంలో మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, జీయంగార్ల గోష్టి, కళాబృందాల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామస్మరణలు, కర్పూర హారతుల నడుమ స్వామివారి వాహనసేవ కనువిందుగా సాగింది.టీటీడీ జీయర్‌స్వాములు, ఈవో రవిచంద్ర, అదనపుఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీఈవో భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇక, ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి బంగారు తిరుచ్చిపై నాలుగు మాడవీధుల్లో ఊరేగారు. కాగా, మంగళవారం ఉదయం చిన్నశేష, హంసవాహనాలపై ఉత్సవమూర్తులు దర్శనమివ్వనున్నారు. మరోవైపు తొలిరోజు తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే నెలకొంది. మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో పలుచగా కనిపించాయి.

Updated Date - Oct 13 , 2026 | 12:14 AM