కోలాహలంగా మైలారు పండుగ
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:38 AM
రామకుప్పం మండలం వీర్నమలలో గురువారం మైలారు పండుగ (ఎద్దుల పండుగ) కోలాహలంగా జరిగింది
రామకుప్పం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలం వీర్నమలలో గురువారం మైలారు పండుగ (ఎద్దుల పండుగ) కోలాహలంగా జరిగింది. గ్రామంతో పాటు ఎద్దుల పండుగ చూసేందుకు వచ్చిన పరిసర గ్రామాల ప్రజలతో వీర్నమల వీధులు కిక్కిరిశాయి. గతానుభవాల దృష్ట్యా నిర్వాహకులు బరికి రెండు వైపులా ప్రత్యేకంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. కుప్పం, పలమనేరు నియోజక వర్గాలతో పాటు సరిహద్దులోని తమిళనాడు రైతులూ వచ్చారు. కొందరైతే తమ కోడెగిత్తలను తీసుకొచ్చారు. గ్రామదేవత ఆలయంలో పూజలు నిర్వహించాక రైతులు తమ ఎద్దులను బరిలో పరుగు తీయించారు. వీటిని నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. అత్యంత వేగంతో పరుగులు తీసిన ఎద్దులను తమిళనాడుకు చెందిన వారు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కొనుగోలు చేసినట్టు తెలిసింది.