Share News

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌తో రాయలసీమ రూపురేఖలు మారుతాయి

ABN , Publish Date - Oct 01 , 2026 | 02:07 AM

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌తో రాయలసీమ రూపురేఖలు మారడం ఖాయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. స్థానిక కేజీఎన్‌ కల్యాణ మండపంలో బుధవారం టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌చార్జి జి.శంకర్‌యాదవ్‌ అధ్యక్షతన సీఎం చంద్రబాబు పర్యటన, స్థానిక ఎన్నికలపై కూటమి నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌తో రాయలసీమ రూపురేఖలు మారుతాయి
మాట్లాడుతున్న మంత్రి జనార్దన్‌రెడ్డి

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి జనార్దన్‌రెడ్డి

ములకలచెరువు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌తో రాయలసీమ రూపురేఖలు మారడం ఖాయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. స్థానిక కేజీఎన్‌ కల్యాణ మండపంలో బుధవారం టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌చార్జి జి.శంకర్‌యాదవ్‌ అధ్యక్షతన సీఎం చంద్రబాబు పర్యటన, స్థానిక ఎన్నికలపై కూటమి నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మదనపల్లెలో రూ.లక్ష కోట్లతో ప్రారంభించనున్న హార్టికల్చర్‌ హబ్‌తో రైతుల జీవన ప్రమాణాలు మారడంతోపాటు రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. మదనపల్లెలో జరిగే సీఎం పర్యటనకు నియోజకవర్గం నుంచి ఉప్పెనలా తరలిరావాలన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో విజయం సాధించి సత్తా చాటాలన్నారు. టీడీపీ జోన్‌-4 కో ఆర్డినేటర్‌ దాచమర్ల సత్య, జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌, శంకర్‌యాదవ్‌, జనసేన పార్టీ ఇన్‌చార్జి పోతుల సాయినాథ్‌, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్‌తాజ్‌ మాట్లాడుతూ హంద్రీ - నీవా జలాలతో కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన సీఎం ఇప్పుడు హార్టికల్చర్‌ హబ్‌ను తీసుకొచ్చారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు కట్టా దొరస్వామినాయుడు, పాలగిరి సిద్ధా, జిట్టా వెంటకరమణ, సురేంద్రయాదవ్‌, గుత్తికొండ త్యాగరాజు, వెంకటస్వామి, చెన్నకిష్టా, కేవీ రమణ, ఎర్రగుడి సురేశ్‌, ముత్తుకూరు మౌళా, జేసీబీ సుధాకర్‌నాయుడు, అగ్రహారం సయ్యద్‌బాషా, గుత్తా సుధాకర్‌నాయుడు, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 02:07 AM