Share News

‘డ్రోన్‌’ చూస్తోంది..!

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:50 AM

జిల్లా కేంద్రమైన చిత్తూరుపై పోలీసులు డ్రోన్‌ ద్వారా ప్రత్యేక నిఘా పెట్టారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగడాన్ని, పేకాటను, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

‘డ్రోన్‌’ చూస్తోంది..!
మద్యం తాగుతున్న వారిని డ్రోన్‌ ద్వారా తీసిన ఫొటో

జిల్లా కేంద్రమైన చిత్తూరుపై పోలీసులు డ్రోన్‌ ద్వారా ప్రత్యేక నిఘా పెట్టారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగడాన్ని, పేకాటను, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాల, సాంబయ్య కండ్రిగ అటవీ ప్రాంతంలో నిఘా పెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న మూడు బృందాలను గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా డ్రోన్‌తో నిఘా పెట్టామని సీఐ మహేశ్వర తెలిపారు.

- చిత్తూరు అర్బన్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 05 , 2026 | 01:50 AM