సొంతింటి కల సాకారం
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:54 AM
వేలాదిమంది సొంతింటి కల నేడు సాకారం కానుంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 5,572 టిడ్కో ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నాయుడుపేటలో టిడ్కో ఇళ్లకు సీఎం ప్రారంభోత్సవం
నాయుడుపేట/తిరుపతి(కలెక్టరేట్), మార్చి 29 (ఆంధ్రజ్యోతి): వేలాదిమంది సొంతింటి కల నేడు సాకారం కానుంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 5,572 టిడ్కో ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.నాయుడుపేటలో 2,064, వెంకటగిరిలో 1,824, శ్రీకాళహస్తిలో 1684 ఇండ్లను సోమవారం లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకున్నామని టిడ్కో ఎస్‌ఈ మహేష్ తెలిపారు. నాయుడుపేటలో సోమవారం ఉదయం 11.40గంటలకు టిడ్కో గృహాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తారు.అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి సంభాషిస్తారు.ఈ సందర్భంగానే ఆయన రాష్ట్రవ్యాప్తంగా కూడా టిడ్కో ఇండ్లకు ఆన్‌లైన్ పద్ధతిలో ప్రారంభోత్సవం చేస్తారు.