Share News

పింఛన్ల పంపిణీలో జిల్లాకు మూడవ స్థానం

ABN , Publish Date - Apr 02 , 2026 | 01:58 AM

ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది.2,63,368మందికి పెన్షన్‌ అందజేయాల్సి వుండగా 2,49,100మందికి పంపిణీ చేశారు.

పింఛన్ల పంపిణీలో జిల్లాకు మూడవ స్థానం
రామచంద్రాపురం మండలంలో పెన్షన్‌ అందిస్తున్న ఎమ్మెల్యే పులివర్తి నాని

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది.2,63,368మందికి పెన్షన్‌ అందజేయాల్సి వుండగా 2,49,100మందికి పంపిణీ చేశారు.రేణిగుంట మండలం గురవరాజుపల్లెలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ పింఛన్లు పంపిణీ చేశారు.రామచంద్రాపురం, పాకాల మండలాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, వరదయ్యపాళెంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, వడమాలపేట మండలం పూడి ఎస్టీ కాలనీలో నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్‌, వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ , సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే విజయశ్రీ, పుల్లంపేటలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌, తిరుపతిలో యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నరసింహయాదవ్‌ పెన్షన్లను పంపిణీ చేశారు.

Updated Date - Apr 02 , 2026 | 01:58 AM