Share News

కాణిపాకంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , Publish Date - May 25 , 2026 | 12:59 AM

కాణిపాక వరసిద్ధుడి ఆలయంలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచి వేల సంఖ్యలో భక్తులు స్వామి దర్శనార్థం ఆలయానికి విచ్చేశారు.

కాణిపాకంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఐరాల(కాణిపాకం), మే 24 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధుడి ఆలయంలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచి వేల సంఖ్యలో భక్తులు స్వామి దర్శనార్థం ఆలయానికి విచ్చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తుల దాహార్తిని తీర్చడానికి సిబ్బంది తాగునీరు, మజ్జిగను అందించారు. స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.

Updated Date - May 25 , 2026 | 12:59 AM