జనగణన అధికారి మీ ఇంటికి రాలేదా? ... అయితే ఫోన్ చేయండి
ABN , Publish Date - May 27 , 2026 | 12:56 AM
జనగణన-2027లో భాగంగా ఈనెల 1 నుంచి ప్రారంభమైన ఇళ్ల గణన 88 శాతంపైగా పూర్తయింది. సర్వే పూర్తి కాని ఇళ్లకు ఆ సంఖ్య ఉండడం లేదు. ఈక్రమంలో జనగణన అధికారి ఇంటికి రాకపోతే వెంటనే 0857224273, 0857224274 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు.
చిత్తూరు కలెక్టరేట్, మే 26(ఆంధ్ర జ్యోతి): జనగణన-2027లో భాగంగా ఈనెల 1 నుంచి ప్రారంభమైన ఇళ్ల గణన 88 శాతంపైగా పూర్తయింది. గృహ వివరాలు నమోదు చేశాక గణకులు ప్రతి ఇంటికీ ఒక నంబరు ఇస్తున్నారు. సర్వే పూర్తి కాని ఇళ్లకు ఆ సంఖ్య ఉండడం లేదు. వేసవి సెలవులు, జీవనోపాధి పనులతో దూర ప్రాంతాలకు వెళ్లి చాలా రోజుల తరువాత వచ్చాక గణకులు ఆ ఇంటి వివరాల సేకరణను మర్చిపోయే అవకాశం ఉంది. ఈక్రమంలో జనగణన అధికారి ఇంటికి రాకపోతే వెంటనే 0857224273, 0857224274 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు. ఆ నెంబరుకు ఫోన్ చేసి వివరాలు చెబితే గణకులను పంపించి వివరాలను యాప్‌లో నమోదు చేయిస్తామన్నారు.