సముద్రతీరంలో పర్యాటకుల సందడి
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:55 AM
వాకాడు మండలంలోని తూపిలిపాళెం సముద్రతీరం ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసింది. పాఠశాలలకు సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చారు.
వాకాడు, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): వాకాడు మండలంలోని తూపిలిపాళెం సముద్రతీరం ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసింది. పాఠశాలలకు సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఇంతమందికి అవసరమైన వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపి తగిన వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.