Share News

సైకిల్‌ జోరు..తిరగని ఫ్యాను

ABN , Publish Date - Nov 04 , 2026 | 02:47 AM

మదనపల్లె మునిసిపాలిటీపై టీడీపీ జెండా రెపరెపలాడింది. ఆ పార్టీ ఛైర్మన్‌ అభ్యర్ధి శ్రీరామ్‌ చినబాబుకు బ్రహ్మరథం పట్టారు. 1,16, 958 మంది ఓటర్లు ఉండగా ఆదివారం నాటి ఎన్నికలో 71,924 ఓట్లు పోలయ్యాయి. మంగళవారం ఓట్ల లెక్కింపు మొదలైన్పటి నుంచీ శ్రీరామ్‌ చినబాబు దూకుడు కొనసాగింది. మూడు రౌండ్లలోనూ ఆధిక్యత సాధించారు. మొదటి రౌండులో 12900, రెండవ రౌండులో 12422, మూడవ రౌండులో 12499 ఓట్లతో కలుపుకొని 37832 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్ధి జింక చలపతికి మొదటి రౌండులో 9181, రెండవ రౌండులో 9547, చివరి రౌండులో 9464 ఓట్లు కలిపి 28199 ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో వార్డుల్లోనూ కూటమి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.

సైకిల్‌ జోరు..తిరగని ఫ్యాను
శ్రీరామ్‌చినబాబుకు డిక్లరేషన్‌ అందిస్తున్న ఇన్‌చార్జి మంత్రి జనార్దనరెడ్డి, రవాణా మంత్రి రాంప్రసాదరెడ్డి,తదితరులు

మదనపల్లెపై పసుపుజెండా రెపరెపలు

  • నెరవేరిన టీడీపీ ఏళ్ల నాటి కల

  • 32 వార్డుల్లో కూటమి ఘనవిజయం

  • 12సీట్లతో చతికిలపడ్డ వైసీపీ

  • రాయచోటిలో అన్నింటా కూటమి ఏకగ్రీవం

  • కూటమి శ్రేణుల్లో విజయోత్సాహం

మున్సిపాలిటీ : మదనపల్లె

వార్డుల సంఖ్య: 48

ఏకగ్రీవం :01

టీడీపీ : 22

జనసేన : 06

బీజేపీ: 04

వైసీపీ :12

బీఎస్పీ :01

స్వతంత్రులు: 03

మున్సిపాలిటీ :రాయచోటి

మొత్తం వార్డులు :44

ఏకగ్రీవం : 44

టీడీపీ : 40

బీజేపీ:03

జనసేన:01

అన్నమయ్య/మదనపల్లె,నవంబర్‌ 3,(ఆంధ్రజ్యోతి): మదనపల్లె మునిసిపాలిటీపై టీడీపీ జెండా రెపరెపలాడింది. ఆ పార్టీ ఛైర్మన్‌ అభ్యర్ధి శ్రీరామ్‌ చినబాబుకు బ్రహ్మరథం పట్టారు. 1,16, 958 మంది ఓటర్లు ఉండగా ఆదివారం నాటి ఎన్నికలో 71,924 ఓట్లు పోలయ్యాయి. మంగళవారం ఓట్ల లెక్కింపు మొదలైన్పటి నుంచీ శ్రీరామ్‌ చినబాబు దూకుడు కొనసాగింది. మూడు రౌండ్లలోనూ ఆధిక్యత సాధించారు. మొదటి రౌండులో 12900, రెండవ రౌండులో 12422, మూడవ రౌండులో 12499 ఓట్లతో కలుపుకొని 37832 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్ధి జింక చలపతికి మొదటి రౌండులో 9181, రెండవ రౌండులో 9547, చివరి రౌండులో 9464 ఓట్లు కలిపి 28199 ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో వార్డుల్లోనూ కూటమి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.

కూటమి విజయదుందుభి

48 వార్డులకు గాను ఒక స్థానాన్ని టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన మిగిలిన వార్డుల్లో టీడీపీ 21, జనసేన 6, బీజెపీ 4 స్థానాలను గెలుచుకున్నాయి. వైసీపీ 12 స్థానాలకే పరిమితమైంది. స్వతంత్రులు 3 స్థానాల్లో సత్తాను చాటారు. బీఎస్పీ అభ్యర్థి ఒక వార్డు గెలుచుకున్నారు. కూటమి అభ్యర్దులు గెలిచిన చోట మెజార్టీలు ఎక్కువగా నమోదు కావడం విశేషం. ఎస్పీ ధీరజ్‌ పర్యవేక్షణలో భద్రత చర్యలు చేపట్టగా, జేసీ శివనారాయణశర్మ, ఎన్నికల పరిశీలకులు బాలకృష్ణ, ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల..కౌంటింగ్‌ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

సమన్వయంతో సాధన

మదనపల్లె మునిసిపాలిటీ ఏర్పడిన్పటి నుంచీ తెలుగుదేశం పార్టీ ఇంతటి ఘనవిజయం సాఽధించలేదు. గతంలో ఒకసారి ఆ పార్టీ అభ్యర్ధి ఛైర్మన్‌గా పని చేసినా, సంపూర్ణ మెజార్టీ సాధించ లేదు. అధికారం కోసం మరోపార్టీ నుంచి ఇద్దరు సభ్యులను కలుపుకోవల్సి వచ్చింది. ఆ తర్వాత టీడీపీ గెలవలేదు. ఈసారి టీడీపీకి చెందిన శ్రీరామ్‌ చినబాబు బరిలో నిలిచారు. .జిల్లా ఇన్‌ఛార్జ్‌మంత్రి బీసీ జనార్దనరెడ్డి, మంత్రి మండిపల్లె రాం ప్రసాద్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్‌బాబు, జోనల్‌ కన్వీనర్‌ సత్యతో పాటు ఎమ్మెల్యేలు షాజహాన్‌బాష, అమర్‌నాఽథరెడ్డిలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం సాధించారు. నామినేషన్ల తర్వాత తక్కువ సమయమే ఉన్నా ప్రణాళిక ప్రకారం ప్రచారం నిర్వహించారు. వ్యూహాత్మకంగా అడుగులేశారు. దీంతో వైసీపీ కంచుకోటలుగా భావించే వార్డుల్లోనూ.. కూటమి అభ్యర్థుల హవా సాగించారు. తాజాగా జనసేన ఆరు వార్డుల్లో విజయం సాధించగా, బీజేపీ పోటీ చేసిన నాలుగుస్థానాల్లోనూ గెలిచి వందశాతం విజయాన్ని నమోదు చేసింది. పార్టీల కలయికతో కూటమి బలం 32 చేరింది

చతికిలపడిన వైసీపీ

అభ్యర్దుల ఎంపిక చేయడంలో వైసీపీ విఫలమైందనే అభిప్రాయముంది. ప్రజల్లో పట్టున్న నాయకులు పోటీకి అందుబాటులో లేకుండాపోయారు. దీంతో భార్యాభర్తలకు సైతం టికెట్లను కేటాయించాల్పి వచ్చింది. ఇలా నాలుగు జంటలు పోటీ చేశాయి. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచీ నాయకుల్లో ఉత్సాహం కొరవడింది. క్యాడర్లో మనోధైర్యం నింపేవారు లేకపోయారు. దీంతో ఎన్నడూ లేనంత భారీ ఓటమిని వైసీపీ మూటకట్టుకుంది. జిల్లాలో పుంగనూరు, రాయచోటి మునిసిపాలిటీలకు గత ఎన్నికల సందర్భంలో వైసీపీ చేసిన అరాచకాలు ప్రజలు మర్చిపోలేరు. ఇందుకు భిన్నంగా ఈసారి కూటమి ప్రభుత్వం నామినేషన్ల పర్వం మొదలు ప్రచారం వరకూ ప్రశాంత వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. పోలింగ్‌ రోజు కూడా ఘర్షణలు జరగలేదు.

రెబల్స్‌ ప్రభావం..మారిన సమీకరణాలు

కూటమి పార్టీల్లోని అసంతృప్తులు..స్వంతత్రులుగా బరిలోకి దిగిన 15, 21, 22వార్డుల్లో విజయం సాధించడం ఆసక్తికర పరిణామం. ఆయా వార్డుల్లో పార్టీ అభ్యర్థులకు ప్రత్యామ్నాయంగా నిలిచిన స్వతంత్రులు, ఓటర్ల మద్దతు పొందారు. 15వార్డుల్లో ఎస్‌.రఘునాథనాయుడు(ఎ్‌స.ఎల్‌.వి.రఘు), 21వార్డుల్లో బర్నేపల్లె రవికుమార్‌, 22వార్డుల్లో ఎం.సుజాత విజయం సాధించారు. 32వార్డులో బీఎస్పీ అభ్యర్థి జి.అరుణ్‌కుమార్‌..447 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితాలు పట్టణంలో స్థానిక అభ్యర్థుల ప్రభావం, వ్యక్తిగత ఓటు బ్యాంకు కూడా కీలకంగా పనిచేసినట్లు స్పష్టమవుతోంది.

రాయచోటిలో ఏకగ్రీవం

రాయచోటి మునిసిపాలిటీలో ఛైర్మన్‌ పదవితో పాటు 44 వార్డులు ఏకగ్రీవంగా కూటమి గెలుచుకుంది. ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన బోనమల ఖాదర్‌వలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 44 వార్డు సభ్యుల్లో టీడీపీ 40, బీజెపీ 3, జనసేన 1 ఖాతాలో వేసుకున్నాయి.

Updated Date - Nov 04 , 2026 | 02:47 AM