Share News

బ్యాలెట్‌ పేపర్లు వచ్చేశాయ్‌!

ABN , Publish Date - Sep 12 , 2026 | 01:28 AM

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 791 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌ కూడా ఖరారు చేస్తున్నారు. 12,54,368మంది గ్రామీణ ఓటర్లు తేలగా, 7,458పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు.

బ్యాలెట్‌ పేపర్లు వచ్చేశాయ్‌!
బ్యాలెట్‌ పేపర్ల బండిల్స్‌ను దించుతున్న సిబ్బంది

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 791 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌ కూడా ఖరారు చేస్తున్నారు. 12,54,368మంది గ్రామీణ ఓటర్లు తేలగా, 7,458పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణ బ్యాలెట్‌ పద్ధతిలో జరగనుంది. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించి 11 టన్నులు, మున్సిపాలిటీలకు సంబంధించి మూడు టన్నులు బ్యాలెట్‌ పేపర్లు శుక్రవారం రాత్రి జిల్లాకు వచ్చాయి. వీటిని తిరుపతి ఎంఆర్‌పల్లెలోని పంచాయతీరాజ్‌ అతిథి గృహంలో భద్రపరిచారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక వీటిని ముద్రణకు పంపించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఇక తెలంగాణకు వెళ్లిన బ్యాలెట్‌ బాక్సులు సైతం తిరుపతికి చేరుకోకున్నాయి.

Updated Date - Sep 12 , 2026 | 01:28 AM