Share News

రేపట్నుంచీ 5కేంద్రాల్లో టెట్‌

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:12 AM

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్‌) కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్షలు బుధవారం నుంచి 21వతేదీ వరకు జరగనున్నాయి.

రేపట్నుంచీ 5కేంద్రాల్లో టెట్‌

- తమిళనాడులో 3, జిల్లాలో 2కేంద్రాలు

- పరీక్షరాయనున్న 11,991మంది అభ్యర్థులు

తిరుపతి రూరల్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్‌) కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్షలు బుధవారం నుంచి 21వతేదీ వరకు జరగనున్నాయి.ఉదయం 9.30-12.00గంటలు, మధ్యాహ్నం 2.30-5.00గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 11,991మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారని, వీరికోసం చెన్నైలో 3కేంద్రాలు, జిల్లాలో తిరుపతి, పుత్తూరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఈవో కేవీఎన్‌ కుమార్‌, పరీక్ష విభాగ అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.సుఽధ పేర్కొన్నారు. కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక అవసరాలున్న అభ్యర్థుల కోసం వివిధ సెషన్లలో కలిపి మొత్తంగా 49మంది స్ర్కైబ్స్‌ని కేటాయించామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో భద్రత, నిరంతర విద్యుత్‌ సరఫరా, ఇంటర్నెట్‌, తాగునీరు, వైద్య తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులు ముందుగానే హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, పరీక్ష ప్రారంభానికి కనీసం రెండుగంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్‌టికెట్‌తో పాటు చెల్లుబాటయ్యే ఒరిజనల్‌ ఫొటో గుర్తింపుకార్డును తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. ఇక మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌, ఎలక్ర్టానిక్‌ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

పరీక్షా కేంద్రాలివీ

చెన్నైలోని అయాన్‌ డిజిటల్‌ జోన్‌(ఐడీజీ), మణిమంగళం(117మంది), పీఎ్‌సబీ పాలిటెక్నిక్‌(302మంది), శ్రీ జయరామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, (45మంది),తిరుపతిలో అయాన్‌ డిజిటల్‌ జోన్‌(ఐడీజీ), జూపార్క్‌ రోడ్డు(10,422మంది), పుత్తూరులోని సిద్దార్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (1105మంది).

Updated Date - Aug 04 , 2026 | 01:12 AM