రోడ్డు ప్రమాదంలో కౌలు రైతు మృతి
ABN , Publish Date - May 25 , 2026 | 12:55 AM
పీలేరు మండలం వేపులబైలు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌలు రైతు మంజునాథ్(46) మరణించాడు. కర్ణాటక రాష్ట్రం ముళబాగల్‌కు చెందిన మంజునాథ్ కొన్నేళ్లుగా సదుం మండలం తుమ్మగుంటపల్లెలో కాపురం ఉంటూ స్థానిక రైతుల వద్ద భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
పీలేరు, మే 24(ఆంధ్రజ్యోతి): పీలేరు మండలం వేపులబైలు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌలు రైతు మంజునాథ్(46) మరణించాడు. కర్ణాటక రాష్ట్రం ముళబాగల్‌కు చెందిన మంజునాథ్ కొన్నేళ్లుగా సదుం మండలం తుమ్మగుంటపల్లెలో కాపురం ఉంటూ స్థానిక రైతుల వద్ద భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో శనివారం సాయంత్రం పీలేరుకు వచ్చిన అతను రాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గంమధ్యలో వేపులబైలు పంచాయతీ బండమీదపల్లె వద్ద ముందు వెళుతున్న లారీ సడన్ బ్రేకు వేయడంతో ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు పీలేరు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంజునాథ్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.