నిండ్రలో 44.1 ఉష్ణోగ్రత
ABN , Publish Date - May 22 , 2026 | 01:30 AM
వాతావరణ శాఖ చెప్పినట్లే గురువారం జిల్లా నిప్పులగుండంలా మారింది. వేడిగాలులు, ఎండ తీవ్రతతో జనం బయటకు రావాలంటేనే భయపడిపోయారు. ఉదయం 10 గంటల నుంచే వాతావరణం అగ్నిగుండంలా మారిపోయింది.
21 మండలాల్లో 40 డిగ్రీలకు మించి నమోదు
వాతావరణ శాఖ చెప్పినట్లే గురువారం జిల్లా నిప్పులగుండంలా మారింది. వేడిగాలులు, ఎండ తీవ్రతతో జనం బయటకు రావాలంటేనే భయపడిపోయారు. ఉదయం 10 గంటల నుంచే వాతావరణం అగ్నిగుండంలా మారిపోయింది. వడగాల్పులు తీవ్ర ప్రతాపం చూపాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిండ్ర, గంగవరం, పలమనేరు మండలాలు ఆరెంజ్ జోన్‌లోకి వెళ్లాయి. నిండ్రలో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. 21 మండలాల్లో ఎండలు 40 డిగ్రీలకు మించాయి. మండలాల వారీగా.. నిండ్రలో 44.1, నగరిలో 43.6, విజయపురంలో 43.2, తవణంపల్లెలో 42.2, శ్రీరంగరాజపురం, బంగారుపాళ్యంలో 42.0, గంగవరంలో 41.5, గుడిపాలలో 41.1, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్‌లో 41.0, వెదురుకుప్పం, పులిచెర్లలో 40.8, పలమనేరులో 40.7, కార్వేటినగరంలో 40.5, గంగాధరనెల్లూరు, ఐరాల, పాలసముద్రం, పెద్దపంజాణి, పెనుమూరు, పూతలపట్టు, యాదమరిలో 40.4, రొంపిచెర్లలో 39.9, శాంతిపురం, గుడుపల్లెలో 38.7, వి.కోట, బైరెడ్డిపల్లెలో 38.4, కుప్పం, రామకుప్పంలో 37.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- చిత్తూరు కలెక్టరేట్, ఆంధ్రజ్యోతి