టీఐఎస్‌లో టీచర్ల వివరాలు నమోదు చేయాలి : డీఈవో
ABN , Publish Date - Jan 14 , 2026 | 02:04 AM
టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో టీచర్ల వివరాలు తప్పక నమోదు చేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. మంగళవారం స్థానిక డీఈవో ఛాంబర్ నుంచి సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణతో కలిసి జిల్లాలోని ఎంఈవోలు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
చిత్తూరు సెంట్రల్, జనవరి 13(ఆంధ్రజ్యోతి): టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో టీచర్ల వివరాలు తప్పక నమోదు చేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. మంగళవారం స్థానిక డీఈవో ఛాంబర్ నుంచి సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణతో కలిసి జిల్లాలోని ఎంఈవోలు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 121 మందిలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సర్వీస్ వివరాలు తప్పని సరిగా నమోదు చేయాలని, లేని పక్షంలో వారికి పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు సజావుగా రావన్నారు. మరో 121 పాఠశాలల్లో కేడర్ స్ట్రెంగ్త్ తప్పక నమోదు చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే సిబ్బంది పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో 400 మందికి ఎలకా్ట్రనిక్ సైకిళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. పీఎంశ్రీ కింద ఎంపికైన పాఠశాలల్లో పూర్తిచేసిన పనుల బిల్లులు అప్‌లోడ్ చేయాలన్నారు. కాగా జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 30 ప్రైవేటు పాఠశాలలకు నోటీసులు ఇచ్చామన్నారు.