విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన.. ఉపాధ్యాయుడు సస్పెన్షన్
ABN , Publish Date - Aug 04 , 2026 | 01:00 AM
మదనపల్లె కోటగడ్డ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ అబ్దుల్‌బబ్బార్ సస్పెండ్ అయ్యారు. స్థానిక కోటగడ్డ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల అక్కడ స్కూల్ అసిస్టెంట్(సోషల్) షేక్ అబ్దుల్‌జబ్బార్ అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
మదనపల్లె, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): మదనపల్లె కోటగడ్డ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ అబ్దుల్‌బబ్బార్ సస్పెండ్ అయ్యారు. స్థానిక కోటగడ్డ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల అక్కడ స్కూల్ అసిస్టెంట్(సోషల్) షేక్ అబ్దుల్‌జబ్బార్ అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. గత నెల 31వ తేదీన జరిగిన ఈ ఘటనపై అదే రోజున ఆ విద్యార్థిని తల్లికి చెప్పింది. తల్లిదండ్రులు పాఠశాల కమిటీకి, హెచ్‌ఎంకు ఫిర్యాదు చేశారు. విచారణలో వాస్తమని తేలడంతో జిల్లా విద్యాశాఖ అధికారి కె.సుబ్రహ్మణ్యం అతన్ని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, రెండు నెలల క్రితం ఇదే పాఠశాలలో మరో ఉపాధ్యాయుడు, అంతకుముందు ఇంకో ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అప్పట్లో నిందితులపై విద్యార్థినుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేయడంతోపాటు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.