ఉపాధ్యాయుడు ఎర్రప్ప అరెస్టు
ABN , Publish Date - Aug 30 , 2026 | 02:03 AM
విద్యార్థినుల పట్ల అనుచిత ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎర్రప్పను శనివారం అరెస్టు చేసినట్లు పీలేరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
పీలేరు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): విద్యార్థినుల పట్ల అనుచిత ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎర్రప్పను శనివారం అరెస్టు చేసినట్లు పీలేరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండు విధించినట్లు తెలిపారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆయనను సస్పెండ్ చేసినట్లు పీలేరు ఎంఈవో బాబు నాయక్ మరో ప్రకటనలో తెలిపారు.