Share News

ఇన్‌స్ఫైర్‌ మనక్‌లో తంబళ్లపల్లె విద్యార్థి మెరుపు

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:55 AM

ఢిల్లీలో జరగుతున్న జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌లో తంబళ్లపల్లె కన్నెమడుగు హైస్కూల్‌ విద్యార్థి ప్రణవ్‌కుమార్‌ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు.

ఇన్‌స్ఫైర్‌ మనక్‌లో తంబళ్లపల్లె విద్యార్థి మెరుపు
ఎయిర్‌ ప్యూరిఫయర్‌ నమూనాను ప్రదర్శిస్తున్న ప్రణవ్‌కుమార్‌

తంబళ్లపల్లె, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో జరగుతున్న జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌లో కన్నెమడుగు హైస్కూల్‌ విద్యార్థి ప్రణవ్‌కుమార్‌ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. 2023-24లో 9వ తరగతి చదివిన ప్రణవ్‌కుమార్‌ గైడ్‌ టీచర్‌ లక్ష్మీనరసింహ శాస్త్రి మార్గదర్శకత్వంలో పేదలకు ఉపయోగపడేలా తక్కువ ఖర్చుతో గాలిశుభ్రత పరికరం(ఎయిర్‌ ఫ్యూరిఫయిర్‌)ను రూపొందించాడు. ఈనమూనా జాతీయ స్థాయికి ఎంపికైంది. ప్ర ణవ్‌ ప్రస్తుతం సీఏ చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన విద్యార్థిని ఎ ంఈవోలు త్యాగరాజు, నాగసుబ్బరాయుడు, హెచ్‌ఎం మదన్‌మోహన్‌, గ్రామస్తులు అభినందించారు.

ఇది ఏమిటంటే..

వాయు కాలుష్యం వల్ల ప్రజలు శ్వాసకోస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఈ పొగను కాలుష్య రహితంగా మార్చి గాలిలో విడుదల చేసేలా ప్రణవ్‌కుమార్‌ ఎయిర్‌ ప్యూరిఫయర్‌ను రూపొందించాడు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. టెంకాయ నార, బొగ్గు, బొగ్గు పొడితో చేసిన ఫిల్టర్‌, కారు, ఏసీల్లో వాడే పిల్టర్లను ఉపయోగించి సు లభంగా వాడుకునేలా దీనిని తయారు చేశాడు.

Updated Date - Oct 14 , 2026 | 01:55 AM