అద్దె పేరుతో తీసుకెళ్లి తాకట్టు
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:45 AM
అద్దె పేరుతో ట్రాక్టర్లు తీసుకుని కుదువపెట్టే ముఠా గుట్టును రట్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఆదివారం పాత ఎస్పీ కార్యాలయంలో ఆ వివరాలను ఆయన మీడియాకు వివరించారు.
13 ట్రాక్టర్ల స్వాధీనం
ఆరుగురు నిందితుల అరెస్టు
రాయచోటి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : అద్దె పేరుతో ట్రాక్టర్లు తీసుకుని కుదువపెట్టే ముఠా గుట్టును రట్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. ఆదివారం పాత ఎస్పీ కార్యాలయంలో ఆ వివరాలను ఆయన మీడియాకు వివరించారు. సంబేపల్లె మండలం గున్నికుంట్ల గ్రామం మాలపల్లికి చెందిన 14వ బెటాలియన్ ఏఆర్‌ఎ్‌సఐ చంద్రహాస్, కానిస్టేబుల్ లక్కిరెడ్డిపల్లె మండలం సోమలవాండ్లపల్లికి చెందిన సోమల ప్రతాప్ కలిసి గున్నికుంట్ల మాదిగపల్లెకు చెందిన సుధీర్ సహాయంతో గున్నికుంట్ల జాందిగారిపల్లెకు చెందిన బాబ్జికి చెందిన ట్రాక్టర్‌ను నెలకు రూ.35వేలు అద్దె ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. బాడుగతో పాటు ట్రాక్టర్‌ను ఇవ్వకుండా మోసం చేసినందుకు బాబ్జి మండల పోలీస్టేషన్‌లో ఆగస్టు 29న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సంబేపల్లె ఎస్‌ఐ రవికుమార్ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. మండల పరిధిలోని గుండ్రేవాండ్లపల్లె సమీపంలో ఆదివారం ఇద్దరు పోలీసులతో సహా సుధీర్, రాయచోటికి చెందిన నల్లకాలువ వాసుదేవరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన కొత్తపల్లె నరేష్, విశ్వనాథరెడ్డిలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.64.20 లక్షల విలువైన 13 ట్రాక్టర్లను, ఐదు ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన జనార్దన్‌రెడ్డి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ కృష్ణమోహన్ చెప్పారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ రవికుమార్, సీఐ ఎస్.కె.రోషన్, డీఎస్పీ కృష్ణమోహన్‌ను ఎస్పీ ధీరజ్ అభినందించారు.