Share News

‘ఊపిరి’ పోయండి

ABN , Publish Date - Mar 20 , 2026 | 02:13 AM

ఎస్‌ఆర్‌పురం మండలం మెదవాడ గ్రామానికి చెందిన అశ్విని, ప్రకాష్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దోడు ఆరోగ్యంగా ఉన్నా.. రెండేళ్ల వయసున్న దర్శన్‌ లంగ్స్‌ వ్యాధితో బాధ పడుతున్నాడు. డ్రైవర్‌ పనిచేసే ప్రకాష్‌, గృహిణి అశ్విని, ఇప్పటికే రూ.8-రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. వేలూరు సీఎంసీలో చూపించగా, వ్యాధి తీవ్ర రూపం దాల్చడంతో రూ.లక్షల్లో ఖర్చవుతుందని అంచనా వేశారు.

‘ఊపిరి’ పోయండి
దర్శన్‌ వద్ద తల్లిదండ్రులు

  • తీవ్ర దశలో నిమోనియా వ్యాధి

  • ఇంట్లోనే కృత్రిమ శ్వాసతో చిన్నారి

  • వైద్యానికి ఇప్పటికే రూ.10 లక్షల ఖర్చు

  • ఆపై ఆర్థిక స్థోమతలేక దాతల కోసం ఎదురుచూపు

శ్రీరంగరాజపురం, ఆంధ్రజ్యోతి: ఎస్‌ఆర్‌పురం మండలం మెదవాడ గ్రామానికి చెందిన అశ్విని, ప్రకాష్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దోడు ఆరోగ్యంగా ఉన్నా.. రెండేళ్ల వయసున్న దర్శన్‌ లంగ్స్‌ వ్యాధితో బాధ పడుతున్నాడు. డ్రైవర్‌ పనిచేసే ప్రకాష్‌, గృహిణి అశ్విని, ఇప్పటికే రూ.8-రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. వేలూరు సీఎంసీలో చూపించగా, వ్యాధి తీవ్ర రూపం దాల్చడంతో రూ.లక్షల్లో ఖర్చవుతుందని అంచనా వేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులు.. ఇక మెరుగైన వైద్యం అందించే పరిస్థితిలో లేరు. వైద్యం అందించే వరకు దర్శన్‌ సహజ శ్వాస తీసుకోలేని పరిస్థితి ఉండడంతో.. కృత్రిమ శ్వాస అందించేందుకు రూ.50 వేలు పెట్టి బైపాప్‌ మిషన్‌ను కొనుగోలు చేశారు. తల్లిదండ్రులు ఎక్కడికీ వెళ్లకుండా ఈ మిషన్‌ ద్వారా ఇంట్లోనే చిన్నారికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో దాతలు ముందుకొచ్చి తమ బిడ్డకు ప్రాణం పోయాలని అభ్యర్థిస్తున్నారా తల్లిదండ్రులు. దాతలెవరైనా 80087 69140 నెంబరులో సంప్రదించాలని, ఫోనుపే ద్వారా ఈ నెంబరకుఉ ఆర్థికసాయం చేయాలని ప్రకాష్‌ కోరుతున్నారు.

Updated Date - Mar 20 , 2026 | 02:13 AM