సీఎంఓలో ఖరారైన స్వర్ణ చంద్రగిరి
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:58 AM
స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టు ఖరారైంది.ముఖ్యమంత్రి కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం సీఎంవో ముఖ్య అధికారులతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సమావేశమయ్యారు. ఆ సందర్భంగా జిల్లా యంత్రాంగం నుంచి ఇప్పటికే వెళ్ళిన ప్రతిపాదనలకు తోడు ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనలపైనా సమీక్ష జరిగింది. ప్రతిపాదనలను శాఖల వారీగా విభజించి ఆయా శాఖల ముఖ్య అధికారులకు పంపించారు.
ఆయా శాఖలకు ఎమ్మెల్యే నాని ప్రతిపాదనలు
కేంద్ర విద్యా సంస్థ కోసం ఎమ్మెల్యే ఒత్తిడి
తిరుపతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టు ఖరారైంది.ముఖ్యమంత్రి కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం సీఎంవో ముఖ్య అధికారులతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సమావేశమయ్యారు. ఆ సందర్భంగా జిల్లా యంత్రాంగం నుంచి ఇప్పటికే వెళ్ళిన ప్రతిపాదనలకు తోడు ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనలపైనా సమీక్ష జరిగింది. ప్రతిపాదనలను శాఖల వారీగా విభజించి ఆయా శాఖల ముఖ్య అధికారులకు పంపించారు.దానికనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై వారికి ఆదేశాలిచ్చారు. చంద్రగిరి మండలంలోని అన్ని పంచాయతీలు, మజరా గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు యధాతధంగా ఖరారయ్యాయి. పరిశ్రమలు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యే నాని పట్టుబట్టడంతో పరిశ్రమల శాఖకు ఆ దిశగా మార్గదర్శకాలు, ఆదేశాలు ఇచ్చారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో
చెప్పుకోదగ్గ ప్రభుత్వ విద్యా సంస్థ ఒక్కటి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆ లోటు తీరేలా ఓ కేంద్ర విద్యా సంస్థను చంద్రగిరిలో ఏర్పాటు చేయాలని సీఎంవో అధికారులను కోరగా ప్రాధమిక అంగీకారం కుదిరింది.
మంగళం, చెర్లోపల్లెల్లో పోలీస్ స్టేషన్లు
తిరుపతి రూరల్ మండలంలో కొత్తగా రెండు పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనను సీఎంవో ఆమోదించింది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే తిరుపతి రూరల్ మండలంలో ప్రస్తుతం తిరుచానూరు, ఎమ్మార్‌పల్లె పోలీసు స్టేషన్లు వున్నాయి. వీటి పరిధి చాలా ఎక్కువగా వుంది. తిరుచానూరు పరిధిలోకి వచ్చే మంగళం ప్రాంతం ఇపుడు పెద్ద టౌన్‌షి్‌ప అయింది. సప్తగిరి నగర్, బీటీఆర్ కాలనీ, తిరుమలనగర్, మంగళం తదితర నాలుగు పంచాయతీలతో కూడిన ఈ ప్రాంతంలో 22 వేల మంది ఓటర్లు, 60 వేల జనాభా వుంది. తిరుచానూరుకు ఈ ప్రాంతం చాలా దూరంలో వుంది. శాంతి భద్రతల నిర్వహణకు, ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి ఈ ప్రాంతం
కీలకంగా మారింది. దీంతో ఈ నాలుగు పంచాయతీలకు ప్రత్యేకంగా మంగళంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాదించారు.అలాగే ఎమ్మార్‌పల్లె పోలీసు స్టేషన్ పరిధి కూడా చాలా ఎక్కువగా వుంది. దానికోసం చెర్లోపల్లెలో పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసి దాని పరిధిలోకి చెర్లోపల్లె, తుమ్మలగుంట, పేరూరు, పుదిపట్ల, వెంకటపతి నగర్, పెరుమాళ్ళపల్లె, మల్లవరం పంచాయతీలను చేర్చాలని ఎమ్మెల్యే కోరారు. ఈ పంచాయతీల పరిధిలో 30 వేలమంది ఓటర్లు, 60 వేల జనాభా వుందని పేర్కొన్నారు. మంగళం, చెర్లోపల్లెల్లో పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసి వాటిని తిరుచానూరు, ఎమ్మార్‌పల్లె సర్కిళ్ళ నియంత్రణలో వుంచాలని ప్రతిపాదించారు. కొత్తగా పెట్టే స్టేషన్లలో ఎస్‌ఐలు, సిబ్బంది వుంటే చాలునని, సీఐ పోస్టులు
అవసరం లేదని కోరారు. ఈ ప్రతిపాదనకు కూడా సీఎంవో ప్రాఽథమికంగా అంగీకారం తెలిపి సంబంధిత శాఖకు పంపింది. కాగా సీఎంవోలో మధ్యాహ్నం 12 నుంచి గంట పాటు జరిగిన సమావేశంలో స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టుకు తుది రూపు వచ్చినట్టయింది. నెల లోపు నిధుల కేటాయింపునకు సంబంధించిన కసరత్తు కూడా పూర్తి కానుంది.