Share News

దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు..

ABN , Publish Date - Mar 19 , 2026 | 02:39 AM

తండ్రి ఇక లేడన్న దుఃఖాన్ని దిగమింగుకుని ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైన ఘటన ఇది. రామసముద్రానికి చెందిన శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు.

దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు..
తండ్రి మృతదేహం ముందు కన్నీటి పర్యంతమవుతున్న కోమల

రామసముద్రం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): తండ్రి ఇక లేడన్న దుఃఖాన్ని దిగమింగుకుని ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైన ఘటన ఇది. రామసముద్రానికి చెందిన శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన కుమార్తె కోమల స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మంగళవారం ఆమెకు చివరి పరీక్ష కెమిస్ట్రీ కావడంతో కన్నీటితోనే పరీక్షా కేంద్రానికి చేరుకుంది. పరీక్ష హాల్లో ఆమె స్థితిని గమనించిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు పరామర్శించి ఓదార్చారు.

Updated Date - Mar 19 , 2026 | 02:39 AM