Share News

సింగిల్‌ విండోలకు సూపర్‌వైజర్లు

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:03 AM

సహకార సంఘాల లావాదేవీలకు ఇబ్బందులు లేకుండా ఆ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. తమ డిమాండ్ల సాధనకు ఎనిమిది రోజులుగా సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం విధితమే.

సింగిల్‌ విండోలకు సూపర్‌వైజర్లు

సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాల లావాదేవీలకు ఇబ్బందులు లేకుండా ఆ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. తమ డిమాండ్ల సాధనకు ఎనిమిది రోజులుగా సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం విధితమే. ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో 75 సింగిల్‌ విండోల్లో సుమారు 300 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల ఆందోళన కారణంగా సింగిల్‌ విండోల్లో లావాదేవీలు, రుణపంపిణీ, రుణ వసూళ్లు, ఇతర కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలో 55 మంది సూపర్‌వైజర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో సూపర్‌వైజర్‌కు 2-3 సింగిల్‌ విండోలను అప్పగిస్తూ సోమవారం డీసీసీ బ్యాంకు చైర్మన్‌ అమాస రాజశేఖర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. అక్కడి కార్యకలాపాలు, ఇతర వ్యవహారాలను వీరు పర్యవేక్షించనున్నారు.

Updated Date - Feb 24 , 2026 | 01:03 AM