Share News

పోలీసు కస్టడీకి సులోచన

ABN , Publish Date - Nov 14 , 2026 | 02:16 AM

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో రిమాండులో ఉన్న లేడీడాన్‌ కోనేటి సులోచనను టూటౌన్‌ పోలీసులు శుక్రవారం ఉదయం కస్టడీకి తీసుకున్నారు.

పోలీసు కస్టడీకి సులోచన
సులోచన

మదనపల్లె క్రైం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో రిమాండులో ఉన్న లేడీడాన్‌ కోనేటి సులోచనను టూటౌన్‌ పోలీసులు శుక్రవారం ఉదయం కస్టడీకి తీసుకున్నారు. టూటౌన్‌ ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు..వన్‌టౌన్‌ పోలీసులు కొన్ని రోజుల కిందట సులోచన, ఆమె కుటుంబ సభ్యులు శ్రీనాథ్‌, రెడ్డెమ్మ, అనుచరులు మోహన్‌, శ్రీరాములునాయుడిపై ఫోర్జరీ, చీటింగ్‌ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రెడ్డెమ్మ పరారీలో ఉండగా మిలిగిన నిందితులు జైలులో ఉన్నారు. పట్టణానికి చెందిన మార్పూరి శ్రీరామ్‌ ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు ఇటీవల సులోచనతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు సహా మొత్తం 12 మందిపై ఫోర్జరీ, చీటింగ్‌, అక్రమ ప్రవేశం, ఆస్తుల ధ్వంసం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో జైలులో ఉన్న సులోచనను రెండోసారి పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం నిందితురాలిని సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. కేసుల విచారణ, ఆధారాల సేకరణ కోసం సులోచనను అదుపులోకి తీసుకుని విచారించినట్లు ఎస్‌ఐ చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను స్థానిక స్పెషల్‌ సబ్‌జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.

Updated Date - Nov 14 , 2026 | 02:16 AM