Share News

సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు ఇద్దరి సస్పెన్షన్‌

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:18 AM

అడంగల్‌ మార్పునకు రూ.40వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ సిరాజ్‌, సీసీ హేమంత్‌(జూనియర్‌ అసిస్టెంట్‌)లను అరెస్టు చేశారు. ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా.. సిరాజ్‌, హేమంత్‌లను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌ కాలంలో హెడ్‌ క్వార్టర్‌ నుంచి వెళ్లరాదని ఆదేశించారు. ఇదిలా ఉండగా గతంలో పనిచేసి ఓ అధికారి అండతో పలువురు ఉద్యోగులు అక్కడ భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలిసింది. అలాంటివారిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. అలాంటి వారిని కూడా బదిలీ చేసి, ఆర్డీవో కార్యాలయాన్ని ప్రక్షాళన చేయనున్నట్లు సమాచారం.

 సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు ఇద్దరి సస్పెన్షన్‌

ఉద్యోగులు ఇద్దరి సస్పెన్షన్‌

తిరుపతి(కలెక్టరేట్‌), మార్చి 3 (ఆంధ్రజ్యోతి): అడంగల్‌ మార్పునకు రూ.40వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ సిరాజ్‌, సీసీ హేమంత్‌(జూనియర్‌ అసిస్టెంట్‌)లను అరెస్టు చేశారు. ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా.. సిరాజ్‌, హేమంత్‌లను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌ కాలంలో హెడ్‌ క్వార్టర్‌ నుంచి వెళ్లరాదని ఆదేశించారు. ఇదిలా ఉండగా గతంలో పనిచేసి ఓ అధికారి అండతో పలువురు ఉద్యోగులు అక్కడ భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలిసింది. అలాంటివారిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. అలాంటి వారిని కూడా బదిలీ చేసి, ఆర్డీవో కార్యాలయాన్ని ప్రక్షాళన చేయనున్నట్లు సమాచారం.

Updated Date - Mar 04 , 2026 | 01:19 AM