Share News

అప్పిచ్చి మోసపోయానంటూ ఆత్మహత్య

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:53 AM

అప్పుగా ఇచ్చిన సొమ్ము వసూలు కాకపోవడంతో మోసపోయానన్న బాధతో సూళ్లూరుపేటలోని సీపీఎం కార్యాలయ సమీపంలో నివాసం ఉంటున్న అల్లూరు సరళ రెడ్డి (59) ఆత్మహత్యకు పాల్పడింది.

అప్పిచ్చి మోసపోయానంటూ ఆత్మహత్య
అల్లూరు సరళ రెడ్డి (ఫైల్‌ఫొటో)

అప్పుగా ఇచ్చిన సొమ్ము వసూలు కాకపోవడంతో మోసపోయానన్న బాధతో సూళ్లూరుపేటలోని సీపీఎం కార్యాలయ సమీపంలో నివాసం ఉంటున్న అల్లూరు సరళ రెడ్డి (59) ఆత్మహత్యకు పాల్పడింది.పోలీసుల కథనం మేరకు....పొదుపు గ్రూపులో సభ్యురాలైన సరళ లోన్‌ తీసి తన సమీప బంధువు పురంధర్‌కు ఏడాది క్రితం రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చింది.పురంధర్‌ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పొదుపు గ్రూపు సభ్యులకు సమాధానం చెప్పలేక ఆదివారం రాత్రి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.ఆమె రాసిపెట్టిన సూసైడ్‌ లెటర్‌లో తన చావుకు కారణం పురంధర్‌ అని, తన వద్ద రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశాడని పేర్కొంది.తనకు ఆ నగదే ఆధారమని ....ఎలా బతకాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్‌లో రాసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 14 , 2026 | 01:53 AM