Share News

పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లారని ఆత్మహత్య

ABN , Publish Date - Jul 28 , 2026 | 01:20 AM

వరుసకు అన్నదమ్ములైన రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు ఒక కుటుంబాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. తనతోపాటు భార్య, పిల్లలను పోలీసు జీపులో స్టేషన్‌కు తీసుకెళ్లడం అవమానంగా భావించిన ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం రామచంద్రాపురం మండలంలో జరిగింది.

పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లారని ఆత్మహత్య

రామచంద్రాపురం, జూలై 27(ఆంధ్రజ్యోతి): వరుసకు అన్నదమ్ములైన రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు ఒక కుటుంబాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లారు. తనతోపాటు భార్య, పిల్లలను పోలీసు జీపులో స్టేషన్‌కు తీసుకెళ్లడం అవమానంగా భావించిన ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం రామచంద్రాపురం మండలంలో జరిగింది. రాయలచెరువుపేట గ్రామంలో గ్రీన్‌ అంబాసిడర్‌గా ఎస్‌.సుబ్రహ్మణ్యం(52) పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య నిర్మల(45), కొడుకు ప్రశాంత్‌(20), కూతురు జయలక్ష్మి(16) ఉన్నారు. సుబ్రహ్మణ్యం చిన్నాన్న కొడుకు ఎస్‌.హరి మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. వీరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. సుబ్రహ్మణ్యం తరచూ మద్యం తాగి బూతులు మాట్లాడుతుండడంతో పలుమార్లు వీరి మధ్య తగాదాలు జరిగాయి. హరి భార్య సునీత ఈ నెల 25న సుబ్రహ్మణ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్టేషన్‌కు రావాల్సిందిగా పిలిచినా సుబ్రహ్మణ్యం హాజరు కాకపోవడంతో ఆదివారం ఉదయం 10గంటలకు రాయలచెరువుపేటకు వచ్చిన పోలీసులు సుబ్రహ్మణ్యంతో పాటు భార్య, పిల్లలను పోలీసుజీపులో ఎక్కించుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రి 6గంటల ప్రాంతంలో బంధువుల పూచీకత్తుతో విడిచిపెట్టారు. భార్య, పిల్లలను పోలీ్‌సస్టేషన్‌కు పిలవడాన్ని అవమానంగా భావించిన సుబ్రహ్మణ్యం సోమవారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated Date - Jul 28 , 2026 | 01:20 AM