Share News

ఏపీ ఈసెట్‌ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు

ABN , Publish Date - May 09 , 2026 | 01:33 AM

డిప్లొమా కోర్సు పూర్తిచేసి నేరుగా బీఈ, బీటెక్‌, బీ-ఫార్మసీ కోర్సుల్లో సెకండ్‌ ఇయర్‌ (లేటరల్‌ ఎంట్రీ)లో చేరేందుకు ఏపీఈసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచింది.

ఏపీ ఈసెట్‌ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు
కుసుమ

చిత్తూరు సెంట్రల్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): డిప్లొమా కోర్సు పూర్తిచేసి నేరుగా బీఈ, బీటెక్‌, బీ-ఫార్మసీ కోర్సుల్లో సెకండ్‌ ఇయర్‌ (లేటరల్‌ ఎంట్రీ)లో చేరేందుకు ఏపీఈసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి ఈ ప్రవేశ పరీక్షకు 422 మంది హాజరయ్యారు. వీరిలో 392 మంది (224 మంది బాలురు, 168 మంది బాలికలు) ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 92.89 శాతం కాగా.. బాలురు 57.14, బాలికలు 42.85 శాతంగా నమోదైంది. ఈ ఫలితాల్లో బాలురు ముందంజలో నిలిచారు. ఫార్మసీ విభాగంలో గంగాధరనెల్లూరు మండలం ఎగువకాలువ గ్రామానికి చెందిన పి.కుసుమ 146 మార్కులతో రాష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలిచింది.

Updated Date - May 09 , 2026 | 01:33 AM