Share News

పలమనేరులో విచిత్ర వాతావరణం

ABN , Publish Date - Apr 09 , 2026 | 01:45 AM

బుధవారం తెల్లవారుజామున పలమనేరు పట్టణాన్ని పొగమంచు కమ్మేసింది. చలి వాతావరణం నెలకొంది. ఉదయం 6 గంటల సమయంలోనూ మంచు వీడలేదు. చలికాలాన్ని తలపించింది. సూర్యోదయం తర్వాత ఈ వాతావరణంలో నెమ్మదిగా మార్పు వచ్చింది. 11 గంటలకంతా ఎండ సుర్రుమంది. వీధుల్లో జనం పలచబడ్డారు. 12 గంటలకంతా ఎండ తీవ్రత మరింత పెరగడంతో, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బుధవారం పలమనేరులో 40.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం తర్వాత ఉక్కపోత ఎక్కువై స్థానికులు ఇబ్బంది పడ్డారు. తెల్లవారుజామున మాత్రం మంచుతో కొంత చల్లదాన్ని ఇస్తోంది.

 పలమనేరులో విచిత్ర వాతావరణం
బుధవారం ఉదయం: పలమనేరు జాతీయ రహదారిలో కమ్మేసిన పొగమంచు

బుధవారం తెల్లవారుజామున పలమనేరు పట్టణాన్ని పొగమంచు కమ్మేసింది. చలి వాతావరణం నెలకొంది. ఉదయం 6 గంటల సమయంలోనూ మంచు వీడలేదు. చలికాలాన్ని తలపించింది. సూర్యోదయం తర్వాత ఈ వాతావరణంలో నెమ్మదిగా మార్పు వచ్చింది. 11 గంటలకంతా ఎండ సుర్రుమంది. వీధుల్లో జనం పలచబడ్డారు. 12 గంటలకంతా ఎండ తీవ్రత మరింత పెరగడంతో, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బుధవారం పలమనేరులో 40.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం తర్వాత ఉక్కపోత ఎక్కువై స్థానికులు ఇబ్బంది పడ్డారు. తెల్లవారుజామున మాత్రం మంచుతో కొంత చల్లదాన్ని ఇస్తోంది.

- పలమనేరు, ఆంధ్రజ్యోతి

రామకుప్పంలోనూ ఇంతే

మండు వేసవిలోనూ కౌండిన్య అటవీ సమీపంలోని రామకుప్పం ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మంగళవారం రాత్రంతా ఉక్కపోతకు సతమతమైన జనం.. బుధవారం తెల్లవారుజామున మంచుతో వీచిన చల్లని గాలులతో ఉపశమనం పొందారు. ఉదయం 7 గంటలకూ లైట్లు వేసుకుని వాహనదారులు వెళ్లాల్సి వచ్చింది. 8.30 గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత సూర్యుడు భగభగమన్నాడు. 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

- రామకుప్పం, ఆంధ్రజ్యోతి

దేవళంపేటలో వడగళ్ల వాన

వెదురుకుప్పం, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): వెదురుకుప్పం మండలం దేవళంపేట బుధవారం వడగళ్ల వాన కురిసింది. వేసవిలో ఎండల తీవ్రత ఉన్న నేపథ్యంలో ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనం.. ఈ వడగళ్ల వానతో సేద తీరారు. ఇతర ప్రాంతాల్లో వాన పడకపోవడం గమనార్హం.

Updated Date - Apr 09 , 2026 | 01:45 AM