Share News

చోరీకి గురైన వడ్డాణం కొరియర్‌ ద్వారా ఇంటికి

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:12 AM

చోరీకి గురైన 14 సవర్ల బంగారు వడ్డాణం 21 రోజుల తరువాత కొరియర్‌ ద్వారా బాఽధితురాలి ఇంటికి చేరింది.

చోరీకి గురైన వడ్డాణం కొరియర్‌ ద్వారా ఇంటికి

ఆశ్చర్యపోయిన బాధితురాలు

నాయుడుపేట టౌన్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): చోరీకి గురైన 14 సవర్ల బంగారు వడ్డాణం 21 రోజుల తరువాత కొరియర్‌ ద్వారా బాఽధితురాలి ఇంటికి చేరింది.గత నెల 20వ తేదీన నాయుడుపేట మండలం పండ్లూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఓజిలి మండలం పున్నేపల్లెకు చెందిన ఓ కుటుంబం నిశితార్థ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రేణిగుంటకు చెందిన శిల్ప హాజరైంది. ఆ సమయంలో ఆమె దగ్గర ఉన్న 14 సవర్ల బంగారు వడ్డాణం చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈనెల 12వ తేదీ రేణిగుంటలోని శిల్ప ఇంటికి ఓ కొరియర్‌ వచ్చింది. దానిని తెరిచి చూడగా చోరీకి గురైన వడ్డాణం ఉండడంతో ఆశ్చర్యపోయింది. వెంటనే నాయుడుపేట పోలీసులకు సమాచారం అందించింది. ఆ వడ్డాణాన్ని స్వాధీనం చేసుకొన్న పోలీసులు దానిపై ఉన్న వేలిముద్రలను సేకరించే పనిలో పడ్డారు.

Updated Date - Mar 14 , 2026 | 01:12 AM