చోరీకి గురైన ఆటో పొలంలో ప్రత్యక్షం
ABN , Publish Date - Oct 06 , 2026 | 03:07 AM
స్థానిక పోలీస్టేషన్ ఎదుట చోరీకి గురైన ఆటో పొలంలో కనిపించింది. రాయవారిపల్లి పంచాయతీ మేదరపల్లికి చెందిన డిల్లీరాజ్ గతనెల 30వ తేదీ రాత్రి కల్లూరు పోలీస్టేషన్ ముందు తన ఆటో నిలిపి ఉంచగా చోరీకి గురైన సంగతి తెలిసిందే.
విడి భాగాల మాయం
కల్లూరు, అక్టోబర్ 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక పోలీస్టేషన్ ఎదుట చోరీకి గురైన ఆటో పొలంలో కనిపించింది. రాయవారిపల్లి పంచాయతీ మేదరపల్లికి చెందిన డిల్లీరాజ్ గతనెల 30వ తేదీ రాత్రి కల్లూరు పోలీస్టేషన్ ముందు తన ఆటో నిలిపి ఉంచగా చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఆటోను దుండగుడు పీలేరు వైపు తీసుకెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పీలేరు సమీపంలోని పొలంలో ఓ ఆటోను రైతులు గుర్తించారు. వారి సమాచారంతో పోలీసులు వెళ్లి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. టైర్లు, బ్యాటరీని తీసేసి ఖాళీ ఆటోను వదిలేసినట్లు గుర్తించారు. విడిభాగాల విలువ రూ.20 వేలు ఉంటుందని బాధితుడు డిల్లీరాజ్ వాపోయాడు.