Share News

రోజంతా కోర్టు ముందు నిలబడండి

ABN , Publish Date - Jul 09 , 2026 | 01:39 AM

రోజంతాకోర్టు ముందు నిలబడి ఉండాలని, డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ఐదుగురిలో ఇద్దరికి జడ్జి శిక్ష విధించారు చిత్తూరు నగరంలో బుధవారం కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఐదుగురికి రూ.50వేలు జరిమానా విధించా రు. వారిలో ఇద్దరికి జరిమానాతో పాటు రోజంతా కోర్టు ముందు నిలబడేటట్లు శిక్షను విధించారు.

 రోజంతా కోర్టు ముందు నిలబడండి

చిత్తూరు అర్బన్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): రోజంతాకోర్టు ముందు నిలబడి ఉండాలని, డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ఐదుగురిలో ఇద్దరికి జడ్జి శిక్ష విధించారు. ఈ వివరాలను ట్రాఫిక్‌ సీఐ నిత్యబాబు బుధవారం తెలిపారు. చిత్తూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజులుగా ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల తనిఖీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు మద్యం తాగి వాహనాలను నడిపినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు, వారిని బుధవారం కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఐదుగురికి రూ.50వేలు జరిమానా విధించా రు. వారిలో ఇద్దరికి జరిమానాతో పాటు రోజంతా కోర్టు ముందు నిలబడేటట్లు శిక్షను విధించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్‌ సీఐ నిత్యబాబు హెచ్చరించారు.

Updated Date - Jul 09 , 2026 | 01:39 AM