Share News

రుపతి కార్పొరేషన్‌ కార్యదర్శిగా శ్రీవిద్య

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:44 AM

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యదర్శిగా శ్రీవిద్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

రుపతి కార్పొరేషన్‌ కార్యదర్శిగా శ్రీవిద్య

తిరుపతి సెంట్రల్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యదర్శిగా శ్రీవిద్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రస్తుతం సామర్లకోట మున్సిపాలిటీలో గ్రేడు-3 కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

శ్రీకాళహస్తి కమినర్‌గా కేవీ కృష్ణారెడ్డి

శ్రీకాళహస్తి,జూన్‌ 4(ఆంధ్రజ్యోతి):శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్‌గా కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కేవీ కృష్ణారెడ్డిని నియమించారు. ఇక్కడ కమిషనర్‌గా పనిచేస్తున్న భవానీప్రసాద్‌ను తదుపరి పోస్టింగ్‌ కోసం మున్సిపల్‌ శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jun 05 , 2026 | 12:44 AM