Share News

ఉగాది వేడుకలకు శ్రీవారి ఆలయం సిద్ధం

ABN , Publish Date - Mar 19 , 2026 | 02:17 AM

పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలకు తిరుమలలోని శ్రీవారి ఆలయం ముస్తాబైంది.విద్యుత్‌, పుష్పాలంకరణల్లో ప్రత్యేక అందాలతో దర్శనమిస్తోంది.

ఉగాది వేడుకలకు శ్రీవారి ఆలయం సిద్ధం

తిరుమల, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలకు తిరుమలలోని శ్రీవారి ఆలయం ముస్తాబైంది.విద్యుత్‌, పుష్పాలంకరణల్లో ప్రత్యేక అందాలతో దర్శనమిస్తోంది. ఉగాది సందర్భంగా తిరుమల క్షేత్రాన్ని దాదాపు 10 టన్నుల సంప్రదాయ పుష్పాలతో అలంకరించారు. 60 వేల కట్‌ ఫ్లవర్స్‌తో ధ్వజస్తంభం, బలిపీఠాన్ని అలంకరించారు. శ్రీవారి ఆలయంతో పాటు వెలుపల ముఖ్యమైన ప్రాంతాల్లో పూలమాలలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఆలయం వెలుపల వేసిన మూడు యుగాలకు చెందిన సెట్టింగులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి..

Updated Date - Mar 19 , 2026 | 02:17 AM