కుప్పం గంగమ్మకు శ్రీవారి సారె
ABN , Publish Date - May 21 , 2026 | 02:16 AM
కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మకు టీటీడీ తరపున సోదరుడు శ్రీవేంకటేశ్వరుడి సారె, ప్రసాదాలను పెట్టారు. తిరుమల నుంచి సారెను కుప్పం తీసుకొచ్చారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి సారె, ప్రసాదాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు అందజేశారు.
కుప్పం, మే 20 (ఆంధ్రజ్యోతి): కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మకు టీటీడీ తరపున సోదరుడు శ్రీవేంకటేశ్వరుడి సారె, ప్రసాదాలను పెట్టారు. తిరుమల నుంచి సారెను కుప్పం తీసుకొచ్చారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి సారె, ప్రసాదాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు అందజేశారు. ఈ సారెను గంగమ్మకు చంద్రబాబు సమర్పించారు. జాతర సందర్భంగా గంగమ్మకు శ్రీవారి సారెను సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా సారె అందజేశారు. ఇక, పట్టువస్త్రాలు సమర్పించాక చంద్రబాబు దంపతులు కుప్పం గంగమ్మ విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరగంట పాటు ఆలయంలో ఉన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీటీడీ బోర్డు సభ్యుడు శాంతారామ్, డిప్యూటీ ఈవో లోకనాథం, టీటీడీ అర్చకులు, అధికారులతో పాటు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎ్‌స.మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేశ్‌బాబు, గంగమ్మ ఆలయ చైర్మన్ బీఎంకే రవి తదితరులు పాల్గొన్నారు.