Share News

దేవదాయ శాఖ ఆర్జేసీ-2గా శ్రీనివాస్‌

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:42 AM

దేవదాయ శాఖలో తిరుపతి కేంద్రంగా వున్న రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌-2 పోస్టులో ప్రభుత్వం కే.బీ.శ్రీనివా్‌సను నియమించింది.

 దేవదాయ శాఖ ఆర్జేసీ-2గా శ్రీనివాస్‌

తిరుపతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖలో తిరుపతి కేంద్రంగా వున్న రీజనల్‌ జాయింట్‌ కమిషనర్‌-2 పోస్టులో ప్రభుత్వం కే.బీ.శ్రీనివా్‌సను నియమించింది. గుంటూరులో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా వున్న ఆయనను తిరుపతిలో అదనపు బాధ్యతలతో నియమించింది.

లీగల్‌సెల్‌, ప్రోటోకాల్‌ విభాగాలకు డిప్యూటీ కలెక్టర్ల నియామకం

తిరుపతి కలెక్టరేట్‌లోని లీగల్‌ సెల్‌, ప్రోటోకాల్‌ విభాగాల్లో ఖాళీగా వున్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల్లో ప్రభుత్వం కొత్తవారిని నియమించింది. పోస్టింగ్‌ కోసం నిరీక్షిస్తున్న డిప్యూటీ కలెక్టర్‌ పి.తేజస్వి రావును కలెక్టరేట్‌లోని లీగల్‌ సెల్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా, కె.నాగార్జునను కలెక్టరేట్‌లోని ప్రోటోకాల్‌-2 స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులో నియమించారు.

Updated Date - Jun 05 , 2026 | 12:42 AM