ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ
ABN , Publish Date - Aug 14 , 2026 | 02:20 AM
టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ఛైర్మన్‌గా టీడీపీ స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నియమితులయ్యారు.నేడు టీటీడీ ఈవో రవిచంద్ర నుంచీ నియామకపు ఉత్తర్వులను అందుకోనున్నారు.
తిరుపతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ఛైర్మన్‌గా టీడీపీ స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నియమితులయ్యారు.నేడు టీటీడీ ఈవో రవిచంద్ర నుంచీ నియామకపు ఉత్తర్వులను అందుకోనున్నారు.ఆయన తండ్రి అఖిల భారత ఎన్టీయార్ అభిమాన సంఘాల అధ్యక్షుడిగా, ఎన్టీయార్ రాజుగా జిల్లా ప్రజలకు చిరపరిచితులు. దివంగత ఎన్టీయార్‌తో సన్నిహితంగా మెలిగి, తిరుపతి టీడీపీలో కీలకంగా పనిచేసిన ఎన్టీయార్ రాజు గతంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన శ్రీధర్ వర్మ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా, స్టేట్ మీడియా కో ఆర్డినేటర్‌గా చురుగ్గా పనిచేసి అధిష్ఠానం గుర్తింపునకు నోచుకున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ ముఖ్యనేతల సమక్షంలో ఈనెల 22వ తేదీన ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఆయన పదవీ బాద్యతలు చేపట్టనున్నారు.