Share News

శ్రీవారి సేవలో శ్రీలీల

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:58 AM

సినీ హీరోయిన్‌ శ్రీలీల గురువారం తిరుపతి వచ్చారు. లక్కీ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు.అనంతరం తిరుపతి పోలీసులతో కలిసి డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు.యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. సమాజానికి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శ్రీలీలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఏఎస్పీ రవిమనోహరాచారి చెప్పారు.సాయంత్రం శ్రీవాణి ట్రస్టు దాతల కోటాలో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో శ్రీలీల

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): సినీ హీరోయిన్‌ శ్రీలీల గురువారం తిరుపతి వచ్చారు. లక్కీ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు.అనంతరం తిరుపతి పోలీసులతో కలిసి డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు.యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. సమాజానికి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శ్రీలీలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఏఎస్పీ రవిమనోహరాచారి చెప్పారు.సాయంత్రం శ్రీవాణి ట్రస్టు దాతల కోటాలో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:58 AM