Share News

కేఎ్‌ఫసీలో చెడిపోయిన చికెన్‌

ABN , Publish Date - Jun 20 , 2026 | 02:13 AM

తిరుపతిలోని రెండు కేఎ్‌ఫసీ రెస్టారెంట్లలో శుక్రవారం మున్సిపల్‌ అధికారులు తనిఖీలు జరిపారు.ఎయిర్‌ బైపాస్‌ రోడ్డు, భవానీనగర్‌లో వున్న రెస్టారెంట్లలో చికెన్‌ను సరైన ర్యాక్‌ల్లో ఉంచకపోగా దారుణంగా నేలపైనే అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ వుంచడంతో కంపు కొడుతుండడం గమనించారు. దాదాపు 683 కిలోల చెడిపోయిన చికెన్‌ను బెంగళూరులోని వారి సంస్థకు వెనక్కు పంపారు.రెండు కేఎ్‌ఫసీ హోటళ్లకు రూ.10,000 వంతున అపరాధ రుసుం విధించారు.

  కేఎ్‌ఫసీలో చెడిపోయిన చికెన్‌
వంటశాలలను తనిఖీ చేస్తున్న అధికారులు

ఒక్కో హోటల్‌కు రూ.10,000 అపరాధం

తిరుపతి సెంట్రల్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని రెండు కేఎ్‌ఫసీ రెస్టారెంట్లలో శుక్రవారం మున్సిపల్‌ అధికారులు తనిఖీలు జరిపారు.ఎయిర్‌ బైపాస్‌ రోడ్డు, భవానీనగర్‌లో వున్న రెస్టారెంట్లలో చికెన్‌ను సరైన ర్యాక్‌ల్లో ఉంచకపోగా దారుణంగా నేలపైనే అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ వుంచడంతో కంపు కొడుతుండడం గమనించారు. దాదాపు 683 కిలోల చెడిపోయిన చికెన్‌ను బెంగళూరులోని వారి సంస్థకు వెనక్కు పంపారు.రెండు కేఎ్‌ఫసీ హోటళ్లకు రూ.10,000 వంతున అపరాధ రుసుం విధించారు.ఆహార పదార్థాల ప్యాకింగ్‌లపై ఎంఆర్‌డీ లేబుళ్లు లేకపోవడం, స్టోర్‌ రూము అపరిశుభ్రంగా ఉండడం గమనించి నిర్వాహకులపై మున్సిపల్‌ హెల్త్‌ అధికారి యువ అన్వేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.బాలాజీ కాలనీలో, రేణిగుంట రోడ్డులో వున్న దామినోస్‌ రెస్టారెంట్లు, తిరుమల బైపాస్‌ రోడ్డులో, ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులో వున్న మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారి మద్దిలేటి, వెటర్నరీ అధికారి గుణశేఖర్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ చెంచయ్య తనిఖీ చేశారు.రెస్టారెంట్లన్నీ సాలీడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంటు నిబంధనలు పాటించాలని నోటీసులు జారీ చేశారు.

ఇన్నాళ్లూ తనిఖీలు ఎందుకు చేయలేదు?

తిరుపతి మహతి ఆడిటోరియం సమీపంలోని పీపీ చావడిలో మటన్‌ మార్కెట్‌, లీలామహల్‌ సర్కిల్‌ సమీపంలోని చేపల మార్కెట్‌లో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో కుళ్లిపోయిన మాంసం, చేపలు బయటపడడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.ఇన్నాళ్లుగా మార్కెట్‌లో ఈ పరిస్థితులు కొనసాగుతుంటే సంబంధిత అధికారులు ఎందుకు గుర్తించలేక పోయారు? తనిఖీలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నిస్తున్నారు. చేపల మార్కెట్‌లో నాణ్యతను పర్యవేక్షించాల్సిన మత్స్యశాఖ, ఆహార భద్రతా ప్రమాణాలను పరిశీలించాల్సిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, పారిశుధ్య నిర్వహణకు బాధ్యత వహించే మున్సిపల్‌ అధికారులు, వ్యాపార అనుమతులు పరిశీలించే స్థానిక సంస్థల అధికారులు సంవత్సరాల తరబడి తనిఖీలు జరపకుండా ఏం చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 20 , 2026 | 02:13 AM