ఎస్పీఎఫ్ ఏఎ్‌సఐ రాములు సస్పెన్షన్
ABN , Publish Date - May 30 , 2026 | 01:02 AM
మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించారని తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఏపీ ఎస్పీఎఫ్ ఏఎ్‌సఐ జి.రాములును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
తిరుపతి(నేరవిభాగం), మే 29 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించారని తిరుమలలో విధులు నిర్వహిస్తున్న ఏపీ ఎస్పీఎఫ్ ఏఎ్‌సఐ జి.రాములును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రాములు గురువారం రాత్రి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి సత్యనారాయణపురంలోని పూర్విక కర్రీసెంటర్ యమానిపై దాడికి పాల్పడి, అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై కర్రీ సెంటర్ యజమాని శ్రీనివాసులు అలిపిరి పోలీసులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని రాములును స్టేషన్‌కు తరలించి, విచారించారు. ఆయన మద్యం తాగి ఉండటంతో డ్రంక్ టెస్ట్ నిర్వహించి సమాచారాన్ని ఎస్పీ సుబ్బరాయుడికి అందించారు. ఎస్పీ ఆదేశాలతో చర్యలు చేపట్టారు. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించినట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో ఏపీఎస్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వీవీ రామిరెడ్డి ఆదేశాలతో ఉన్నతాధికారులు ఆయన్ను శుక్రవారం సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరగడంతో ప్రజలు అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.