Share News

పగడ్బందీగా స్పెషల్‌ టెట్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 01:35 AM

స్పెషల్‌ టెట్‌ను పగడ్బందీగా నిర్వహించాలని జేసీ శివనారాయణశర్మ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో సంబంధితశాఖ అధికారులతో జేసీ సమీక్షించారు.

పగడ్బందీగా స్పెషల్‌ టెట్‌
స్పెషల్‌ టెట్‌ నిర్వహణపై అధికారులకు సూచనలిస్తున్న జేసీ శివనారాయణశర్మ

మదనపల్లె టౌన్‌, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ టెట్‌ను పగడ్బందీగా నిర్వహించాలని జేసీ శివనారాయణశర్మ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో సంబంధితశాఖ అధికారులతో జేసీ సమీక్షించారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే టెట్‌కు జిల్లాలో మూడు పరీక్ష కేంద్రాల్లో కలిపి 1,616 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని వెల్లడించారు. మదనపల్లె ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల, రాయచోటి భాస్కర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, శ్రీసాయి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఈ పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్ష సమయంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఎస్పీడీసీఎల్‌ అధికారులకు సూచించారు. కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, వైద్య సిబ్బంది ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అభ్యర్థుల హాల్‌ టికెట్లు, గుర్తింపు కార్డులు, ఇతర ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాకే కేంద్రంలోకి అనుమతించాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థులకు అదనపు సమయం కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో డీఈవో సుబ్రమణ్యం, కలెక్టరేట్‌ ఏవో శ్రావణి, ఎస్పీడీసీఎల్‌, మెడికల్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 01:35 AM