Share News

గర్భిణులు, దివ్యాంగులు, వృద్ధులకు స్విమ్స్‌లో ప్రత్యేక రిజిస్ర్టేషన్‌ కౌంటర్లు

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:04 AM

స్విమ్స్‌ ఆస్పత్రిలో గర్భిణులు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఓపీ రిజిస్ర్టేషన్‌ కౌంటర్లు ఏర్పాటు చేయాలని డైరెక్టర్‌ డాక్టర్‌ జగదీష్‌ ఆదేశించారు.

గర్భిణులు, దివ్యాంగులు, వృద్ధులకు   స్విమ్స్‌లో ప్రత్యేక రిజిస్ర్టేషన్‌ కౌంటర్లు

తిరుపతి సెంట్రల్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): స్విమ్స్‌ ఆస్పత్రిలో గర్భిణులు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఓపీ రిజిస్ర్టేషన్‌ కౌంటర్లు ఏర్పాటు చేయాలని డైరెక్టర్‌ డాక్టర్‌ జగదీష్‌ ఆదేశించారు. మంగళవారం మెడికల్‌ రికార్డ్సు విభాగం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వైద్య సేవల నాణ్యతను మరింత పెంపొందించడంతో పాటు ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికీ రిజిస్ర్టేషన్‌ దశ నుంచే సులభమైన, వేగవంతమైన సేవలు అందించేలా మెడికల్‌ రికార్డ్సు విభాగం పనితీరును మరితం సమర్ధవంతంగా తీర్చిదిద్దాలన్నారు. ఓపీ రిజిస్ర్టేషన్‌ కౌంటర్‌లో పనిచేసే ప్రతి ఉద్యోగి బాధ్యతతో పనిచేయాలన్నారు. గర్భిణులు, వృదులు, దివ్యాంగులకు వసరమైన సందర్భాల్లో వీల్‌చైర్లు, సహాయక సిబ్బంది, స్పష్టమైన సూచిక బోర్డులు అందుబాటులో వుండేలా సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో మెడికల్‌ రికార్డ్సు విభాగం ఏడీ వివేక్‌, ఎంఆర్‌వో మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 02:05 AM